తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధిని చూసి ఓర్వలేకే విమర్శలు: ఎమ్మెల్యే ధర్మారెడ్డి - తెలంగాణ తాజా వార్తలు

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ వరంగల్​ పరిధిలోని మొగిలిచర్లలో రూ.6.45 కోట్ల చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు.

mla dharmareddy
మొగిలిచర్లలో రూ.6.45 కోట్ల పనులకు శంకుస్థాపన

By

Published : Apr 8, 2021, 4:16 PM IST

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్​లోని విలీన గ్రామాలకు మంత్రి కేటీఆర్ చొరవతో అధిక నిధులు కేటాయించారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.

గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15వ డివిజన్ మొగిలిచర్లలో రూ.6.45 కోట్లతో అంతర్గత సీసీరోడ్లు, కాలువలు, బీసీ, ఎస్సీ స్మశానవాటికల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మారెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు త్వరగా పూర్తి చేయాలని, పనుల్లో నాణ్యత లోపం కనిపించకూడదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చూడలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని ధర్మారెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం రంగ సంస్థలను విక్రయించడం తప్ప భాజపాకు ఏం చేతకాదని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు.. భాజపా పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా అని ప్రశ్నించారు.

ఇవీచూడండి:రాష్ట్రంలో రూ. 1,020 కోట్లతో రహదార్ల నిర్మాణం

ABOUT THE AUTHOR

...view details