తెలంగాణ

telangana

ETV Bharat / state

'రహదారి విస్తరణలో ఇల్లు కోల్పోతున్నవారికి డబుల్ బెడ్​రూం' - mla dharma reddy visit to akkampeta

రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో పర్యటించారు.

parakala mla dharma reddy
అక్కంపేటలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి పర్యటన

By

Published : Jul 16, 2020, 7:56 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామంలో చేపడుతున్న రహదారి విస్తరణ పనులకు ప్రజలంతా సహకరించాలని కోరారు. తాత్కాలికంగా ఏర్పడే సమస్యలపై దృష్టి సారించకుండా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

రోడ్ల విస్తరణలో ఇళ్లు కోల్పోతున్న వారి జాబితా తయారు చేసి ఇవ్వాలని రెవెన్యూ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. బాధితులకు రెండు పడక గదుల పథకం కింద ఇల్లు ఇప్పిస్తామని ధర్మారెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికే నియోజకవర్గంలో రహదారి విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 182 మంది లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు మంజూరు చేసినట్లు గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details