తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కరోనా పరీక్షలు - assemby meetings

కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ వచ్చిన వారినే... సమావేశాల్లోకి అనుమతిస్తామన్న స్పీకర్ ఆదేశాలతో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరీక్ష చేయించుకున్నారు. ఫలితాల్లో కొవిడ్​ నెగిటివ్​ వచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కరోనా నెగిటివ్
పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కరోనా నెగిటివ్

By

Published : Sep 6, 2020, 11:02 PM IST

ఈ నెల 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న దృష్ట్యా... వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కరోనా పరీక్ష చేయించుకోగా నెగిటివ్​గా తేలింది. కరోనా నివారణకు పాటించాల్సిన నిబంధనలన్నీ పాటిస్తూనే ప్రజాసేవలో అంకితమైన తనకు నెగిటివ్ రిపోర్ట్ రావడం సంతోషంగా ఉందన్నారు.

కరోనా పరీక్షలు చేయించుకొని నెగిటివ్ వచ్చిన వారినే... సమావేశాల్లోకి అనుమతిస్తామన్న స్పీకర్ ఆదేశాలతో కొవిడ్​ పరీక్ష చేయించుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కరోనా సోకినంత మాత్రన ప్రజలు బయపడవద్దని... బాధితులను అంటరానివారిగా చూడొద్దని ఎమ్మెల్యే కోరారు. వైద్యులు సూచించిన నిబంధనలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చని సూచించారు.

ఇదీ చదవండి:"నా సొరకాయలు పోయాయి సార్..!"

ABOUT THE AUTHOR

...view details