పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు పాటించడంపై ఆరా తీశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలలోకి తరలించడంలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి' - mla dharma reddt visited grain purchase center in warangal rural district
ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు పక్షపాతి అని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలంలోని మొండ్రాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు.
!['సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి' parakala mla challa dharma reddy visited grain purchase centers in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7313820-410-7313820-1590216178065.jpg)
'సీఎం కేసీఆర్.. రైతు పక్షపాతి
అనంతరం ఎమ్మెల్యే ధర్మారెడ్డి.. మార్క్ఫెడ్, వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై చర్చించారు. కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
- ఇదీ చూడండి :బావిలో లభ్యమైన మృతదేహాలకు శవపరీక్ష పూర్తి