రైతన్నకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రైతు వేదికల శంకుస్థాపన, రైతు కల్లాలు ఏర్పాటు, వ్యవసాయ సాగులో ప్రస్తుత పరిస్థితులు, రైతుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు.
రైతులకు అందుబాటులో అధికారులు ఉండాలి: ఎమ్మెల్యే ధర్మారెడ్డి - warangal rural latest updates
వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హన్మకొండలోని ఆయన నివాసంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశమయ్యారు.
అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సీఎం కేసీఆర్ మాట ప్రకారమే రైతులు నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారన్నారు. రైతు వేదికలు రైతులకెంతో ఉపయోగకరం అన్నారు. రైతున్నకు అందుబాటులో ఉండాలని వ్యవసాయ అధికారులకు సూచించారు.
ఇదీ చూడండి:కరోనా చికిత్సపై భయం... నమ్మకం పెంచే పనిలో ప్రభుత్వం