వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డిని ఆహ్వానించినా.. అనివార్య కారణాల వల్ల ఆయన హాజరు కాలేదు.
చల్లా ధర్మారెడ్డి ఇలాఖాలో ఎస్సీలచే ప్రారంభోత్సవం - వరంగల్ అర్బన్ జిల్లా తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా పరకాల మండలంలోని నాగారంలో డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనం, మంకి ఫుడ్ కోర్టును నిర్మించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డిని ఆహ్వానించినా.. ఆయన హాజరుకాలేకపోయారు. స్థానిక ఎస్సీ మహిళ, పారిశుద్ధ్య కార్మికులు వాటిని ప్రారంభించారు.
ఎమ్మెల్యే రాకపోవటంతో మహిళలే ప్రారంభించారు
డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, పల్లె ప్రకృతివనం, మంకి ఫుడ్ కోర్టును గ్రామంలోని ఎస్సీ మహిళ ఐన సిలువేరు, పారిశుద్ధ్య కార్మికురాలు ప్రమీల ప్రారంభించారు.