తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్​' - వరంగల్​ రూరల్​ జిల్లా వార్తలు

రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించారు.

parakala mla challa darma reddy visit ryth vedika at peddapur in warangal rural district
'రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్న ఏకైక వ్యక్తి కేసీఆర్​'

By

Published : Sep 12, 2020, 9:45 PM IST

వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతు వేదిక నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారులకు సూచించారు.

దేశంలో ఎక్కడలేని విధంగా రైతుల కోసం వేదికలు నిర్మిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. ఈ వేదికలతో అన్నదాతలకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించుకోవచ్చన్నారు. దసరా పండుగలోగా నియోజకవర్గంలోని 24 రైతువేదికల నిర్మాణాలు పూర్తిచేయాలన్నారు.

ఇదీ చూడండి:కొత్త రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయాలి : కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details