తెలంగాణ

telangana

ETV Bharat / state

దురదృష్టవశాత్తు తప్పిపోయాడు.. అదృష్టవశాత్తు దొరికిపోయాడు - దురదృష్టవశాత్తు తప్పిపోయాడు.. అదృష్టవశాత్తు దొరికిపోయాడు

వరంగల్ రూరల్ జిల్లా పరకాలలోని ప్రభుత్వ ఎస్సీ వసతిగృహం నుంచి ఓ విద్యార్థి తప్పిపోయాడు. అదృష్టవశాత్తు ఓ వ్యక్తి కంటపడి  పోలీసుల సాయంతో తిరిగి మళ్లీ వసతి గృహానికి చేరాడు.

దురదృష్టవశాత్తు తప్పిపోయాడు.. అదృష్టవశాత్తు దొరికిపోయాడు
దురదృష్టవశాత్తు తప్పిపోయాడు.. అదృష్టవశాత్తు దొరికిపోయాడు

By

Published : Nov 27, 2019, 9:04 AM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని మల్లారెడ్డి పల్లి కాలనీలోని ప్రభుత్వ ఎస్సీ వసతిగృహంలో ఉంటూ 7వ తరగతి చదువుతున్న రాజు అనే విద్యార్థి హాస్టల్​ నుంచి తప్పిపోయాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో బస్సు డిపో దగ్గర దీనంగా కూర్చొని ఉన్నాడు.

బాలుడిని చూసిన బండి రమేష్ అనే వ్యక్తి నీవెవరు, ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నంచగా సమాధానం రాలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారమిచ్చాడు. చివరకు బాబు ఎస్సీ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నాడని తెలుసుకున్న పోలీసులు రాజుని హాస్టల్​కి తరలించారు. పిల్లలను సరిగ్గా చూసుకోవాలనివార్డెన్​నిహెచ్చరించారు.

దురదృష్టవశాత్తు తప్పిపోయాడు.. అదృష్టవశాత్తు దొరికిపోయాడు

ఇవీ చూడండి: ఆర్టీసీ సమస్య ముగింపునకే కేబినెట్ సమావేశం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details