వరంగల్ రురల్ జిల్లా పరకాలలో రెండు రోజుల లాక్డౌన్ విధించమని పరకాల మున్సిపాలిటీ అధికారులకు బీజేపీ నేతలు వినతి పత్రం సమర్పించారు. రోజురోజుకు జిల్లాల్లో పెరగడం, పట్టణంలో రెండు కేసులు నమోదు కావడం వంటి ఘటనలు దృష్టిలో ఉంచుకొని రెండు రోజుల పాటు నిత్యావసరాలు తప్ప మిగదా దుకాణాలు పూర్తిగా లాక్డౌన్ చేయాలని కోరారు.
పరకాలలో లాక్డౌన్ విధించమని భాజపా వినతి - వరంగల్ న్యూస్
వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించమని భాజపా నేతలు మున్సిపాలిటీ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. పరకాల పట్టణంలో రెండు కేసులు నమోదైన కారణంగా రెండు రోజుల పాటు లాక్డౌన్ విధించి కరోనా వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
బస్టాండ్, పోలీస్స్టేషన్, ప్రభుత్వ దవాఖాన, కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బందిచే శానిటైజ్ చేయించాలన్నారు. రసాయనాల పిచికారీ చేయించి వైరస్ వ్యాప్తిని నివారించాలని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ మధుసూదన్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మార్త భిక్షపతి, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గండ్ర జైపాల్ రెడ్డి, బీజేపీ కౌన్సిలర్లు ఆర్పీ జయంత్ లాల్, దేవునూరి రమ్యకృష్ణ మేఘనాథ్, కొలనుపాక భద్రయ్య పాల్గొన్నారు.