తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎలుగూర్ రంగంపేట్ చెరువులో చేప పిల్లలను వదిలిన చల్లా - వరంగల్ రూరల్ జిల్లా

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండల పరిధిలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఎలుగూర్ రంగంపేట్ చెరువులో ఎమ్మెల్యే చల్లా చేప పిలల్లను వదిలారు. మండల పరిధిలోని రైతులకు పట్టా పాసు పుస్తకాలను ఎమ్మెల్యే అందించారు.

ఎలుగూర్ రంగంపేట్ చెరువులో చేప పిల్లలను వదిలిన చల్లా
ఎలుగూర్ రంగంపేట్ చెరువులో చేప పిల్లలను వదిలిన చల్లా

By

Published : Sep 3, 2020, 2:10 PM IST

Updated : Sep 3, 2020, 5:00 PM IST

వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండల పరిధిలో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ఉచిత చేప పిల్లలను ఎలుగూర్ రంగంపేట్ చెరువులో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వదిలారు. గంగపుత్రులకు, మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోందని ఆయన వివరించారు. కార్యక్రమంలో సంగెం ఎంపీపీ కండగట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎలుగూర్ రంగంపేట్ చెరువులో చేప పిల్లలను వదిలిన చల్లా

83 కొత్త పాస్ పుస్తకాలు...

పరకాల పరిధి సంగెం మండలంలో రైతులకు పట్టా పాసు పుస్తకాలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అందించారు. ఈ సందర్భంగా రైతులకు రాష్ట ప్రభుత్వం అండగా ఉంటుందని చల్లా పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వివిధ గ్రామాల రైతులకు 83 కొత్త పట్టా పాస్ పుస్తకాలను అందించారు.

'కంటికి రెప్పలా'

తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుని కంటికి రెప్పలా కాపాడుకుటుందని, రైతుల కోసం చేపట్టిన పథకాలు దేశానికే ఆదర్శనీయమన్నారు. రైతు బందు పథకం ద్వారా రైతు కళ్లలో ఆనందం కనిపిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సంగెం ఎంపీపీ కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, ఏనుమముల మార్కెట్ ఛైర్మన్ చింతం సదానందం, తహసీల్దార్, ఎంపీడీఓ సహా అధికారులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి :భాగ్యనగరంలో తొలి లైవ్ ఫిష్​మార్ట్

Last Updated : Sep 3, 2020, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details