కేంద్రం సహకరించకపోయినా ఈ ఏడాది ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మోసానికి ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగొద్దనే ఆలోచనతోనే సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి స్పష్టం చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తీర్మాలయాపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిచారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలను కల్పించాలని సంబంధిత అధికారులకు తెలిపారు.
గతేది కొన్న ధాన్యం నిలువలు గోదాముల్లో పేరుకుపోయాయని తెలిపారు. వచ్చే యాసంగిలో వరి పంట వేసి రైతులు నష్టపోకూడదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వడ్లను కొనేపరిస్థితి లేదని పేర్కొన్నారు. వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. లాభసాటి వ్యవసాయంతో రైతులు నూతన ఒరవడిని తీసుకురావాలని కోరారు. నాణ్యమైన విత్తనాలు రైతులు వేసేట్లుగా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.