గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ రోజు వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం కాపులకనపర్తి నుంచి సంగెం చేపట్టిన నూతన తారురోడ్డు నిర్మాణ పనులకు స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఇందుకు గాను రూ. 4 కోట్ల 96 లక్షల నిధులను ప్రభుత్వం కేటాయించింది.
రాష్ట్రంలో జులై 1 నుంచి ప్రారంభమయ్యే పల్లె ప్రగతిలో భాగంగా ప్రతీ గ్రామం మొక్కలు నాటడంలో పోటీ పడాలని ఎర్రబెల్లి సూచించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ఉంటాయన్నారు. మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నిధుల కొరత ఏమైనా ఉంటే గ్రామ పంచాయతీల నిధుల నుంచి వాడుకోవాలని అధికారులను ఆదేశించారు.