నర్సరీలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిశీలకులు శివకుమార్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సిబ్బందితో కలిసి ఆయన పరిశీలించారు.
'నర్సరీలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి' - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు
గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ పరిశీలకులు శివకుమార్ సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండల కేంద్రంలోని నర్సరీలను ఆయన పరిశీలించారు. ఆనంతరం గ్రామానికి సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు.
'నర్సరీలపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి'
అనంతరం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన శివకుమార్ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని సూచించారు. ప్రతీ మొక్కను బ్రతికించుకోవాల్సిన బాధ్యత కార్యదర్శులపైనే ఉందన్నారు. ఈ సందర్భంగా దామెర గ్రామానికి సంబంధించిన పలు రికార్డులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఎంపీవో యాదగిరి, సర్పంచి శ్రీరాంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదంవడి:విజయవంతంగా కొనసాగుతున్న టీఎస్ బీపాస్..