అయ్యప్పస్వామి వారికి నిర్వహించే పంబారట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డి స్వయంగా రథం నడుపుతూ మాదన్నపేట చెరువుకట్టకు తరలించారు. ఆలయం నుంచి డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో అలరిస్తూ ఊరేగింపుగా వెళ్లారు.
నర్సంపేటలో ఘనంగా పంబారట్టు ఉత్సవం - వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో అయ్యప్పస్వామికి పంబారట్టు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే స్వయంగా స్వామివారి రథం నడుపుతూ మాదన్నపేట చెరువుకట్టకు తరలించారు.
![నర్సంపేటలో ఘనంగా పంబారట్టు ఉత్సవం Pambarattu festival is celebrated in Narsampet in waranagal rurla dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9824309-258-9824309-1607534793722.jpg)
నర్సంపేటలో ఘనంగా పంబారట్టు ఉత్సవం
అనంతరం చెరువులో స్వామివారికి జలక్రీడలు నిర్వహించి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పంబారట్టు కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూలలా నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. అయ్యప్పస్వామి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. స్వామివారి ఆశీస్సులతో దేవాదుల నీటిని రంగయ్యచెరువు, పాకాల,మాదన్నపేట చెరువుకు తీసుకొచ్చి స్వామివారి పాదాలు కడుగుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ఛైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఏసీపీ ఫణిందర్, భక్తులు పాల్గొన్నారు.
నర్సంపేటలో ఘనంగా పంబారట్టు ఉత్సవం
ఇదీ చూడండి:కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్
Last Updated : Dec 10, 2020, 7:04 AM IST