తెలంగాణ

telangana

ETV Bharat / state

'కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఉండొద్దు' - paddy purchase centers in warangal rural district

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అధికారులను ఆదేశించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

mla aruri ramesh, vardhannapeta mla aruri ramesh, paddy purchase centers
ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, వరంగల్ గ్రామీణ జిల్లా వార్తలు

By

Published : May 3, 2021, 3:40 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదేశించారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం రామోజీ కుమ్మరిగూడెం తండాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తరుగు, తాలు, మద్దతు ధర విషయంలో రైతులు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సరైన రేటుతో కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులంతా అప్రమత్తంగా ఉండి కరోనా నిబంధనలు పాటిస్తూ ధాన్యం అమ్మాలని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details