వరంగల్ రూరల్ జిల్లా పరకాల సబ్డివిజన్లో బుధవారం నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. పరకాల పట్టణంలోని దామర చెరువు పూర్తిగా నిండగా పెద్ద చెరువు, చాలివాగు అలుగులు పోస్తున్నాయి. ఆత్మకూరు శివారు కటాక్షపూర్ చెరువు మత్తడి దూకింది.
పొంగిపోర్లుతున్న వాగులు, చెరువులు... రైతుల్లో ఆనందం - Overflowing ditches and ponds due to heavy rain in warangal rural district
పరకాల సబ్డివిజన్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు పొంగిపోర్లుతున్నాయి. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పొంగిపోర్లుతున్న వాగులు, చెరువులు... రైతుల్లో ఆనందం
రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వర్షాల వల్ల కొంతమంది నగరవాసులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్