వరంగల్ గ్రామీణ జిల్లాలో గొర్లెకుంట మృతుల హత్యలకు సంబంధించి బయట వ్యక్తుల ప్రమేయం తోసిపుచ్చలేమని ఫోరెన్సిక్ వైద్య నిపుణులు రజా మాలిక్ పేర్కొన్నారు. వారిని సంచుల ద్వారా తీసుకొచ్చి బావిలో పడేసినట్లు అనుమానం ఉందని ఆయన చెబుతున్నారు. వారికి మత్తు, విషం కలిపితే వాసన తెలిసిపోతోందని... అయితే మృతదేహాలు కుళ్లిపోయినందున ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్ తేల్చాల్సి ఉంటుందని చెప్పారు.
ఆ హత్యలపై బయటి వ్యక్తుల ప్రమేయం ఉంది! - Gorrekunta latest news today
సంచలనం సృష్టించిన గొర్లెకుంట మృతుల హత్యలకు సంబంధించి బయట వ్యక్తుల ప్రమేయం తోసిపుచ్చలేమని ఫోరెన్సిక్ వైద్య నిపుణులు రజా మాలిక్ అన్నారు. బతికి ఉన్నప్పుడే నీళ్లలో వేసి ఉంటారని ఆయన పునరుద్ఘాటించారు. మూడేళ్ల బాబుపై గాయాలు లేవని.. మిగతా వారి మృతదేహాలపైన గాయాలున్నాయని చెప్పారు. వారం పది రోజుల్లో ఎఫ్ఎస్ఎల్ నివేదిక వచ్చే అవకాశాలున్నట్లు తెలిపారు. ఆత్మహత్యచేసుకునే అవకాశాలు లేవని.. మత్తు ఇచ్చి బావిలో పడేసే అవకాశాలున్నాయంటున్న రజా మాలిక్‌తో మా ఈటీవీ భారత్ ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.
ఆ హత్యలపై బయటి వ్యక్తుల ప్రమేయం ఉంది!