వరంగల్ గ్రామీణ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. సెయింట్ థెరిసా స్కూల్ దగ్గర టాటా మ్యాజిక్ వాహనం వేగంతో వచ్చి బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది.
ఆలయానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం - warangal rural district latest news today
ఆత్మకూరు మండల కేంద్రంలో ఈరోజు ఉదయం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా మ్యాజిక్ వాహనం వేగంతో వచ్చి బ్రిడ్జ్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆలయానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం
వారి వివరాలు ముల్క స్రవంతి (20), జంగం నగేష్ (55), జంగం కమల(50), రచ్చ రామ (45), జంగం స్వప్న (22), బండారీ సువర్ణ (25). వారు శివరాత్రి సందర్భంగా రామప్ప ఆలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో అక్కంపేట్కి వస్తుండగా ప్రమాదం జరిగింది. బాధితులను స్థానికులు వరంగల్ ఎమ్జీఎమ్ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి :రామప్ప కాటన్ పేరుతో రానున్న కొత్త రకం చీరలు