Old Couple Tragedy: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను రిక్షాలో ఆస్పత్రికి తీసు లక్ష్మిని రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళుతున్న ఈ వృద్ధుడి పేరు రాములు. వీరిది హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ గ్రామం కాగా.. అక్కడ ఉండేందుకు ఇల్లు లేకపోవడంతో హనుమకొండలో చిత్తు కాగితాలు ఏరుకుని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు.
ఆకలి.. అనారోగ్యం.. వృద్ధ దంపతుల దైన్యం - hanumakonda news
Old Couple Tragedy: ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు. అయినా.. ఆకలైనప్పుడు ఓ ముద్ద పెట్టేందుకు ఒక్కరు కూడా అందుబాటులో లేరు. చిత్తు కాగితాలేరుకుని కడుపు నింపుకునే ఆ వృద్ధులను.. వారం రోజులుగా పస్తులుండేలా చేశాడు వరణుడు. వారంరోజులుగా తినడానికి తిండి లేక.. పెట్టడానికి నా అన్న వాళ్లు లేక ఆ వృద్ధ జంట అనారోగ్యం పాలైంది.
Old Couple Tragedic story at hanumakonda
కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఉపాధి కరవై ఆకలితో అలమటిస్తున్నారు. వృద్ధురాలు అనారోగ్యం పాలవడంతో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్తూ కాజీపేటలో గురువారం ఇలా కనిపించారు. ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నా.. వారంతా ఉపాధి కోసం వివిధ ప్రాంతాల్లో ఉన్నారని, తమ బాగోగులు చూసే వారు లేరని వృద్ధుడు తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఈ దంపతులు వేడుకుంటున్నారు.