తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మార్వో ఆఫీసు పైకెక్కి వృద్ధజంట ఆత్మహత్యాయత్నం - శాయంపేట ఎమ్మార్వో కార్యాలయం తాజా వార్తలు

తహసీల్దార్​ కార్యాలయం భవనంపైకి వృద్ధ దంపతులు ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్​ గ్రామీణ జిల్లా శాయంపేట తహసీల్దార్​ కార్యాలయం వద్ద జరిగింది.

old couple suicide attempt at sayampeta mro office in warangal district
ఎమ్మార్వో కార్యాలయం ఎక్కి వృద్ధ జంట ఆత్మహత్యాయత్నం

By

Published : Oct 19, 2020, 5:25 PM IST

వరంగల్​ గ్రామీణ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సోమవారం శాయంపేట తహసీల్దార్​ కార్యాలయం భవనంపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. పెద్దకోడెపాక ఎస్​బీఐ సర్వీస్​ బ్యాంకు నిర్వాహకులు తమకు రూ. 20 వేలు మోసం చేశారంటూ వారు ఆరోపించారు.

విషయం తెలుసుకున్న తహసీల్దార్​ ఘటనపై విచారణ జరుపుతామని సముదాయించగా వృద్ధ దంపతులు కిందకి దిగివచ్చారు. అనంతరం తహసీల్దార్​కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఇదీ చూడండి :జర్నలిస్టు కుమారుడి కిడ్నాప్​.. రూ. 45 లక్షలు డిమాండ్!

ABOUT THE AUTHOR

...view details