రాష్ట్ర ప్రభుత్వం ప్రతష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదిక భావనల నిర్మాణాల కోసం వరంగల్ గ్రామీణ జిల్లా అధికారులు స్థలాలను పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా వర్ధన్నపేట మండలం ఇల్లంద, కట్రియాల గ్రామాల్లోని స్థలాలను జిల్లా మైనారిటీ వెల్ఫేర్ అధికారి, రైతు వేదిక ప్రత్యేక అధికారి యాకూబ్, మండల వ్యవసాయ శాఖ అధికారులు రాంనర్సయ్య, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
రైతు వేదికల స్థలాల సేకరణకు అధికారుల కసరత్తు - warangal rural district news
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద, కట్రియాల గ్రామాల్లో రైతు వేదికల భవనాల కోసం అధికారులు స్థలాలు పరిశీలించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేతుల మీదగా శంకుస్థాపనలు ఉన్నందున ఏర్పాట్లు పూర్తి చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
officers visited places in vardhannapet for raithu vedhika buildings
రైతు వేదిక నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు పలు సలహాలు, సూచనలు చేశారు. రాబోయే రెండు మూడు రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేశ్ చేతుల మీదగా శంకుస్థాపనలు ఉన్నందున ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.