వరంగల్లో తొలివిడుత నామినేషన్ల స్వీకరణ - mptc
ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలైంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు.
నామినేషన్ల స్వీకరణ
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట, పర్వతగిరి మండలాల్లో తొలి విడత ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఆయా ప్రాంతాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో రిటర్నింగ్ అధికారులకు నామ పత్రాలు సమర్పించారు. జడ్పీటీసీ అభ్యర్థిగా మార్గం భిక్షపతి, పలువురు ఎంపీటీసీ అభర్థులు నామినేషన్ వేశారు. నామపత్రాల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీస్లు బందోబస్తు ఏర్పాటు చేశారు.