వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123వ జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటీష్ వారి మీద పోరాడి ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరుల చరిత్ర ఇప్పటి తరాలకు తెలియకుండా చేయడం వారిని అవమానించడమేనని ఆ పార్టీ నాయకుడు అరకొండ కొమురయ్య అన్నారు.
శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు - nethaji subhash chandra bose birth anniversary
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని వరంగల్ రూరల్ జిల్లా శాయంపేటలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఇంటి పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి పూలమల వేసి నివాళులు అర్పించారు. ఉద్యమకారుల చరిత్ర భావి తరాలకు అందిచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.
![శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5812455-thumbnail-3x2-nethaji.jpg)
శాయంపేటలో నేతాజీ 123వ జయంతి వేడుకలు
స్వతంత్ర సమరయోధులతో పాటు తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులను కేసులు పెట్టి నిర్బంధించడం ద్వారా కేసీఆర్ ప్రజాస్వామ్య ద్రోహిగా మారాడని అన్నారు. ప్రజాస్వామ్యవాదులను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు చింతల భాస్కర్, చిరంజీవి, వీవీ స్వామి పాల్గొన్నారు.
ఇది చూడండి: 'పెద్ద' మనిషి మృగత్వం... బాలికపై అఘాయిత్యం