వరంగల్ గ్రామీణ జిల్లాలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరిగింది. వర్ధన్నపేట మండల పరిధిలోని కస్తూర్బా వసతి గృహంలో జిల్లా వ్యవసాయ అధికారి ఉషాదయాల్ హాజరై బాలికలతో సందడి చేశారు. విద్యార్థినులకు జాతీయ బాలికల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఆటపాటలతో జాతీయ బాలికల దినోత్సవం - వరంగల్ గ్రామీణ జిల్లా నేటి వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని కస్తూర్బా వసతి గృహంలో జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. బాలికలు ఆటపాటలతో అలరించారు.

ఆటపాటలతో జాతీయ బాలికల దినోత్సవం
పిల్లలలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు పలు పాటలకు నృత్యాలు చేశారు. సృజనాత్మకత ప్రతిబింబించేలా హస్త కళా ప్రదర్శనలు చేశారు.
ఆటపాటలతో జాతీయ బాలికల దినోత్సవం
ఇదీ చూడండి : మంత్రి గంగుల నిబంధన ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు