తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీబీ వలలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్ - Narsampeta muncipal commissioner trapped

ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం లంచం డిమాండ్ చేసిన ఓ మున్సిపల్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

Narsampeta muncipal commissioner
ఏసీబీ వలలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్

By

Published : Dec 2, 2019, 10:16 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో మున్సిపల్ కార్యాలయంలో అవినీతి చేప ఏసీబీకి చిక్కింది. పట్టణంలోని నెహ్రునగర్‌కు చెందిన కొక్కు అశోక్ ఇంటి నిర్మాణం కోసం అక్టోబర్ 30న దరఖాస్తు చేసుకున్నాడు. అతనికి ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వకుండా.. చెప్పులు అరిగేలా తిప్పించుకుంటూ.. రూ. 5 వేలు ఇస్తేనే అనుమతి ఇస్తానని కమిషనర్ చెప్పగా విసుగు చెందిన అశోక్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

ఈరోజు మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్​కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా కార్యాలయంలో ఉన్న కమిషనర్ వెంకటేశ్వర్లు.. జూనియర్ అసిస్టెంట్ కిరణ్​కు డబ్బులు ఇవ్వాలని సూచించారు. సదురు అధికారికి డబ్బులు ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జూనియర్ అసిస్టెంట్ కిరణ్​ను అదుపులోకి తీసుకున్నారు.

ఏసీబీ వలలో నర్సంపేట మున్సిపల్ కమిషనర్

ఇవీచూడండి: 'దోషులకు ఉరి శిక్షతోనే 'దిశ'కు న్యాయం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details