దేవాదుల మూడోదశ ఎత్తిపోతల పథకం ద్వారా కొద్దిరోజులలో నర్సంపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ములుగు జిల్లా కేంద్రానికి అతి సమీపంలో రామప్ప చెరువును ఆనుకొని నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాన్ని మీడియా ప్రతినిధులతో కలిసి సందర్శించారు. రామప్ప, పాకాల, రంగా చెరువు ఎత్తిపోతల పథకం పనులు దాదాపు పూర్తయ్యాయని వెల్లడించారు. తర్వలోనే సీఎం చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పాకాలకు మూడు టీఎంసీలు, రంగయ్య చెరువుకు రెండు టీఎంసీల నీటిని అందించి నర్సంపేట ప్రాంత రైతుల కష్టాలను తీరుస్తామని ఆయన తెలిపారు.
'నర్సంపేటను సస్యశ్యామలం చేస్తాం' - Narsampeta Mla peddi sudarshan reddy visit devadula project
వరంగల్ రూరల్ జిల్లాలో నిర్మిస్తున్న దేవాదుల మూడోదశ ఎత్తిపోతల పథకం పనులను తర్వలోనే పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
'నర్సంపేటను సస్యశ్యామలం చేస్తాం'