వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం గురిజాల, నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. మక్కలకు క్వింటాల్‌కు రూ.1760 మద్దతు ధర అందిస్తున్నామని తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సుదర్శన్‌రెడ్డి - latest news on narsampeta mla peddi Sudarshan Reddy
వరంగల్ గ్రామీణ జిల్లాలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
కరోనా వ్యాప్తి దృష్ట్యా రైతులు వారికి కేటాయించిన సమయాల్లోనే మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కేంద్రాలకు వచ్చిన రైతులు సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులను ధరించాలన్నారు. కార్యక్రమంలో నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:కరోనా చీకటిపై దివ్వెల కాంతులతో దేశం పోరు