Dalithabandhu: దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తామని, ఆ తర్వాతే మిగతావారికి అవకాశమిస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ జిల్లా ఖానాపురంలో గురువారం తెరాస ముఖ్యనేతలు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితబంధు ఎంపికలపై ప్రతిపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా తొలుత అర్హులైన తెరాస కార్యకర్తలకే ఇస్తామని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే తెరాస అధికారంలో ఉండాలని.. అందుకోసం కృషి చేస్తున్న అర్హులైన పార్టీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు మొదట అందేలా చూస్తామని ఆయన స్పష్టంచేశారు. రెండు పడకగదుల ఇళ్ల లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తారని, దళితబంధు ఎంపికలను మాత్రం నేరుగా సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా పలువురు దళితులు తెరాసలో చేరారు.
'దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యం.. ఆ తర్వాతే మిగతావారికి..'
Dalithabandhu: దళితబంధు పథకంపై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామని.. ఆ తర్వాతే మిగతావారికి అవకాశమిస్తామని ఆయన పేర్కొన్నారు.
'దళితబంధులో తెరాస కార్యకర్తలకే ప్రాధాన్యం.. ఆ తర్వాతే మిగతావారికి..'