మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం శ్రీరాజరాజేశ్వరస్వామిని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలోని శివలింగానికి గోదావరి జలాలతో పూజలు చేశారు. అనంతరం ఖానాపురం మండలం పాకాల సరస్సులో గోదారి జలాలు కలిపారు.
'పాకాల, రంగయ్య చెరువులకు త్వరలోనే గోదావరి జలాలు' - పాకాల సరస్సులో గోదారి జలాలు
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజవర్గ ప్రజల కల త్వరలోనే సాకారం కానుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలిపారు. పాకాల, రంగయ్య చెరువులకు త్వరలోనే గోదావరి జలాలు రానున్న సందర్భంగా... గుండం శ్రీరాజరాజేశ్వరస్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు.
narsampet mla peddi sudarshan reddy visited gundam rajarajeshwara temple
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట నియోజవర్గంలోని పాకాల, రంగయ్య చెరువులకు త్వరలోనే గోదావరి జలాలు రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. జిల్లావాసుల కల తొందర్లోనే సాకారమవనుందని ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: మరో రెండు నెలలు గడ్డురోజులే..!