మాదన్నపేట చెరువును మినీట్యాంక్ బండ్‌గా మారుస్తానని గతంలో తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని... నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణ జిల్లా మాదన్నపేట చెరువులో టూరీజం శాఖ ఏర్పాటు చేసిన బోటును ఆయన ప్రారంభించారు.
మాదన్నపేట చెరువులో బోటును ప్రారంభించిన ఎమ్మెల్యే - వరంగల్ గ్రామీణ జిల్లా తాజా వార్తలు
వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులో టూరీజం శాఖ ఏర్పాటు చేసిన బోటును ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. కాసేపు పట్టణ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి బోటులో తిరిగారు.
మాదన్నపేట చెరువులో బోటు ప్రారంభం, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
పట్టణ కౌన్సిలర్లు, పార్టీ నాయకులతో కలిసి కొంతసేపు బోటులో ప్రయాణించారు. పట్టణాన్ని పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. చెరువులో ఏర్పాటు చేసిన బోటు అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ కూటమి అసాధ్యం'