తెలంగాణ

telangana

ETV Bharat / state

రామప్ప-పాకాల ప్రాజెక్టు కోసం ఉద్యమం: ఎమ్మెల్యే

రామప్ప-పాకాల ప్రాజెక్టు కోసం త్వరలో ఉద్యమం చేస్తామని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. గోదావరిపై పాజెక్టులు ఏర్పాటు చేసుకుంటుంటే కేంద్ర మంత్రులు ఎందుకు అడ్డు పడుతున్నారని నిలదీశారు. రబీ సాగు కోసం పాకాల సరస్సు నీటిని ఆయన విడుదల చేశారు.

narsampet-mla-fire-on-central-government-at-pakala-in-warangal-rural-district
రామప్ప-పాకాల ప్రాజెక్టు కోసం త్వరలో ఉద్యమం: ఎమ్మెల్యే

By

Published : Dec 21, 2020, 2:30 PM IST

రామప్ప-పాకాల ప్రాజెక్టు కోసం ఉద్యమానికి సిద్ధంగా ఉండాలని వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఖానాపురం మండలంలోని పాకాల సరస్సు నీటిని రబీ సాగు కోసం ఆయన విడుదల చేశారు. సరస్సులో 27ఫీట్ల మేర నీరు ఉండగా... 11వేల ఎకరాలకు సాగు నీరందించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. స్థానికంగా ఉన్న కట్టమైసమ్మకు కొబ్బరికాయ కొట్టి... అనంతరం సంగెం, తుంగబంధం కాల్వలకు సంబంధించిన తూములను నుంచి నీటిని విడుదల చేశారు.

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నదే నీళ్ల కోసమని... గోదావరిపై పాజెక్టులు ఏర్పాటు చేసుకుంటుంటే కేంద్ర మంత్రులు ఎందుకు అడ్డు పడుతున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రం నిధులు కేటాయించిందా? అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:విషాదం: కన్నేపల్లిలో తల్లి, కూతురు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details