వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలోని భారతీ మహిళా పొదుపు సంఘం 27వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు. 1993లో 75 మంది సభ్యులతో ప్రారంభమైన పొదుపు సంఘం, ప్రస్తుతం 769 సభ్యులకు చేరింది. ఆనాడు కేవలం రూ. 1500 పొదుపు జమ కాగా.. నేటి వరకు ఒక కోటి 43 లక్షల రూపాయలు జమ అయ్యాయి.
ఒకప్పుడు రూ. 1500.. ఇప్పుడు రూ.కోటి 43 లక్షలు - warangal rural district nachinapally
నాచినపల్లిలోని భారతీ మహిళా పొదుపు సంఘం 27వ వార్షికోత్సవం సంతోషంగా జరుపుకున్నారు. 1993లో 75 మంది సభ్యులతో ప్రారంభమైన పొదుపు సంఘం, ప్రస్తుతం 769 సభ్యులకు చేరింది. ఆనాడు కేవలం రూ. 1500 పొదుపు జమ కాగా.. నేటికి ఒక కోటి 43 లక్షల రూపాయల వరకు జమ అయ్యాయి.
ఒకప్పుడు రూ. 1500.. ఇప్పుడు రూ.కోటి 43 లక్షలు
సంఘంలోని ప్రతి సభ్యురాలు ఎలాంటి షూరిటీ లేకుండా లక్షా 30 వేల వరకు అప్పు పొంది వారి అవసరాలను తీర్చుకుంటున్నారని సంఘం అధ్యక్షురాలు తెలిపారు. ఇప్పటి వరకు రూపాయి వడ్డీకి అప్పులిచ్చిన సంఘం ఇక నుంచి సభ్యులకు 75 పైసల వడ్డీకే రుణాలు ఇవ్వాలని తీర్మానం చేసుకున్నారు. వార్షిక సమావేశంలో ఆదాయ వ్యయాలను ఘనకులు చదివి సభ్యులకు వినిపించి ఆమోదం పొందారు.
ఇదీ చూడండి :'వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అందరి కృషి అవసరం'