వరంగల్ జిల్లా పరకాల పట్టణంలోని రామ్‌నగర్‌లో హత్య జరిగింది. బండారి రాధ(46) అనే మహిళను ఆమె అక్క కొడుకు అయిన బండారు వెంకటేష్ మంచం పట్టెతో బలంగా తలపై మోది హత్య చేశాడు. ఆస్తి తగాదాలే హత్యకు కారణమని నిందితుడి తల్లి పుష్ప పోలీసులకు తెలిపింది.
తండ్రితో అక్రమ సంబంధం.. ఆస్తి గొడవ.. చంపేశాడు.! - వరంగల్ జిల్లా వార్తలు
వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో హత్య జరిగింది. ఆస్తి తగాదాల వల్ల సొంత అక్క కొడుకే తలపై బలంగా కొట్టి మహిళను హత్య చేశాడు.
ఆస్తి కోసం.. అక్క కొడుకే చంపేశాడు!
20 సంవత్సరాల క్రితం తన తండ్రితో అక్రమ సంబంధం కొనసాగించి.. ఆస్తి తగాదాలకు కారణమైందన్న కోపంతో వెంకటేష్ రాధమ్మను హత్య చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. పరకాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్