తెలంగాణ

telangana

ETV Bharat / state

పరకాల పురపాలక సంఘం సమావేశం గరంగరం - పరకాల పురపాలక సంఘం సమావేశం

వరంగల్ రూరల్ జిల్లా పరకాల పురపాలక సంఘం సర్వసభ్య సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరకాల పట్టణంలో రోడ్ల మరమ్మతులకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు. 34 అంశాలపై చర్చించి దాదాపు రూ.కోటిన్నర అభివృద్ధి పనులకు అనుమతులు ఇచ్చారు.

municipal-meeting-at-parkal-in-warangal-rural-district
పరకాల పురపాలక సంఘం సమావేశం గరంగరం

By

Published : Oct 9, 2020, 5:48 PM IST

వరంగల్ రురల్ జిల్లా పరకాల పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. పరకాల పట్టణంలో రోడ్ల మరమ్మతులకు కేటాయించిన రూ.కోటి పక్క దారి పట్టించే ప్రయత్నం మానుకోవాలని భాజపా సభ్యులు డిమాండ్ చేశారు. 21 మంది కౌన్సిలర్​లు, ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు, కమిషనర్ యాదగిరి, ఛైర్​పర్సన్​ అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు. కౌన్సిలర్ మల్లేశం మృతి పట్ల రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు.

అనంతరం 34 అంశాలపై చర్చ జరిపి... దాదాపు రూ.కోటిన్నర అభివృద్ధి పనులకు పచ్చ జెండా ఊపారు. బతుకమ్మ, దసరా ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని కొవిడ్ నిబంధనలు పాటించేలా తగిన ఏర్పాట్లు చేయాలని తీర్మానించారు.

ఇదీ చదవండి:సమ్మక్క-సారలమ్మలకు బతుకమ్మ చీరలు సమర్పించిన మంత్రి సత్యవతి

ABOUT THE AUTHOR

...view details