తమ భూములను అధికారులు, అధికారపార్టీ నేతలు ఆక్రమించి తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ నేతలు రిలేనిరాహారదీక్ష చేపట్టారు. వరంగల్ గ్రామీణ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండల కేంద్రాల్లో నిరాహారదీక్షకు దిగారు.
'దళిత, గిరిజనుల భూములకు రక్షణ కల్పించాలి' - వరంగల్ రూరల్ జిల్లా తాజా వార్తలు
దళితులు, గిరిజనుల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని, వాటిని రక్షించాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ నేతలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. వరంగల్ గ్రామీణాజిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, సంగెం, పర్వతగిరి మండలకేంద్రాల్లో నిరాహారదీక్ష చేస్తున్నారు.
తమ భూమలు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు 24 తేదీ నుంచి 29 తేదీ వరకు దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిజనులు, దళితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో ప్రభుత్వంపై తిరుగుపాటు తప్పదని హెచ్చరించారు.
ఇదీ చూడండి:'తెలంగాణ ఏర్పడిన తర్వాత స్వర్ణయుగం వచ్చింది'