వరంగల్ గ్రామీణ జిల్లాలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఓ వానరం, శునకం దోబూచులాడుకుంటూ తెగ హంగామా చేసాయి. వీటి చిలిపి చేష్టలకు రాయపర్తి మండలం మైలారం గ్రామం వేదికైంది. కోతి తన చేష్టలతో కుక్క పైకి ఎక్కి కూర్చొని దాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. ఈ రెండింటి కొట్లాట అక్కడే ఉన్న స్థానికులను ఆకట్టుకుంది.
viral video: వానరం, శునకం దోబూచులాట.. వీడియో వైరల్ - monkey and dog fight each other in funny way
కొట్లాటకు సై అంటే సై అనే వానరం, శునకం.. సరదాగా దొంగాట ఆడుకుంటూ చూపరులను ఆహ్లాదంలో ముంచెత్తాయి. వాటి సరదా ఆటను తన చరవాణిలో వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పంచుకోవడంతో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వరంగల్ గ్రామీణ జిల్లా మైలారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వానరం, శునకం దోబూచులాట
ఉప్పునిప్పులా ఉండే ఈ రెండు జంతువుల దోబూచులాటను ఓ వ్యక్తి తన చరవాణిలో బంధించారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.