తెలంగాణ

telangana

ETV Bharat / state

Warangal NIT: ఎన్​ఐటీ రిజిస్ట్రార్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే - Warangal nit issues

తెలంగాణ విశ్వవిద్యాలయం(telangana university)లో ఉద్యోగ నియామకాల వివాదం కొనసాగుతుండగా.. మరో వర్సిటీలో అలాంటి ఆరోపణలే వెలుగుచూశాయి. వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ-నిట్‌(National Institute of Technology)లో రిజిస్ట్రార్‌పై... ఎన్​ఐటీ(National Institute of Technology) పూర్వ విద్యార్థి అయిన మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌(MLA Shankar naik) స్వయంగా ప్రధానికి, కేంద్ర విద్యాశాఖకు లేఖ రాశారు.

Warangal NIT
వరంగల్​ ఎన్​ఐటీ వివాదం

By

Published : Nov 15, 2021, 1:55 PM IST

వరంగల్‌లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థ-నిట్ రిజిస్ట్రార్(NIT registrar) ఎస్.గోవర్ధన్‌రావును నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నారని కేంద్రానికి ఫిర్యాదులు అందాయి. ఎన్​ఐటీ పూర్వ విద్యార్థి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ (MLA Shankar naik), మరో పూర్వ విద్యార్థి దినేశ్ రెడ్డిలు ఈ మేరకు కేంద్ర విద్యాశాఖకు, ప్రధానికి లేఖలు రాశారు. ఉద్యోగ నియామకాలు, నిధుల వినియోగంలోనూ రిజిస్ట్రార్ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని కోరారు.

బాబా అటామిక్ రీసెర్చ్ కేంద్రం (Baba Atomic Research Center) నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన రిజిస్ట్రార్ ఏడాది ఆగస్టు 31న ఆయన పదవీ విరమణ పొందాల్సి ఉంది. అయితే ఆయన పదవీకాలాన్ని మరో నాలుగేళ్లు పెంచుతూ ఎన్​ఐటీ 'బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (Board of Governors)' నిర్ణయం తీసుకొంది. గోవర్ధన్ రావు డిప్యుటేషన్‌ను బార్క్ పొడిగించలేదని, అలాంటప్పుడు ఎన్​ఐటీలో ఆయన పదవీకాలాన్ని పెంచే అధికారం 'బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ (Board of Governors)కు ఎలా ఉంటుందని ఉద్యోగవర్గాలు ప్రశ్నిస్తున్నాయి. రిజిస్ట్రార్ బార్క్ నుంచి వచ్చినందున ఆ సంస్థకు చెందిన అనేక మందికి నిట్‌లో కీలక పోస్టులు కట్టబెట్టారని, పలువురు పదవీ విరమణ పొందిన సిబ్బందిని తీసుకొచ్చి భారీగా వేతనాలు చెల్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

రిజిస్ట్రార్‌ కొనసాగింపులో నిబంధనలు ఉల్లంఘించలేదని నిట్ సంచాలకుడు ఆచార్య ఎన్వీ రమణారావు తెలిపారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ (MLA Shankar naik) లేఖపై కేంద్రానికి సమాధానం ఇచ్చామని తెలిపారు. కొందరు సిబ్బంది అక్రమాలను కట్టడి చేయడంతో పనిగట్టుకొని లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి:WARANGAL NIT: ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్​లో వరంగల్​ నిట్​కు 23వ ర్యాంక్

ABOUT THE AUTHOR

...view details