దేవాదుల మూడో ఫేస్ పనులను నిలిపివేయాలని కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడాన్ని నిరసిస్తూ... వరంగల్ గ్రామీణ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్ రెడ్డి కేంద్రమంత్రికి ఉత్తరాలను పంపే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అన్ని అనుమతులను తీసుకుని పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి దేవాదుల మూడోఫేజ్ కింద రామప్ప-రంగాయ, రామప్ప-పాకాల ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందని ఎమ్మెల్యే వెల్లడించారు. పూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణం అయిపోయిన తర్వాత... ప్రాజెక్టుల నిర్మాణం నిలిపివేయలని ఆదేశాలు జారీ చేయడం తినే అన్నంలో మట్టికొట్టడం లాంటిదని అన్నారు.