కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం గోజేగాం గ్రామానికి చెందిన 90మంది గిరిజన వలస కూలీలు ఉపాధి కోసం ఖమ్మం జిల్లా జూలూరుపాడుకు వెళ్లారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక పిల్లలను తీసుకుని సొంతూరు బాట పట్టారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి - వలస కూలీలకు చేయూత ఇచ్చన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
కాలినడకన వెళ్తున్న 90మంది గిరిజన కూలీలను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదుకున్నారు. వాళ్లకు భోజనం పెట్టించారు. ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో ఆర్డీసీ బస్సుల్లో వారి స్వగ్రాలకు చేర్చి దాతృత్వం చాటారు.
మానవత్వం చాటిన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ సమీపంలో వీరిని పోలీసులు అడ్డగించారు. పోలీసులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వారికి భోజనం పెట్టించి, అధికారులతో మాట్లాడి ప్రత్యేక వాహనాల్లో వారిని స్వగ్రామాలకు చేర్చారు.