వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం, మక్కలు లిఫ్ట్ చేసే ప్రక్రియలో సహకారం అందించిన వారందరికీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. శాయంపేట మండలం నుంచి ఇప్పటి వరకు ఐకేపీ సెంటర్ ద్వారా 1,22,130 క్వింటాళ్లు, పీఏసీఎస్ ద్వారా 61132.40 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మండలంలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు.
'ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు' - ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు
కరోనా సమయంలోనూ రైతుల వద్దకే వెళ్లి వారి నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయించడం... సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలో ధాన్యం కొనుగోళ్లకు సహకరించిని అధికారులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
'ధాన్యం కొనుగోళ్లకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు'
ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా వారి వద్ద నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడం, నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం... సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందని ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డితో పాటు జడ్పీ ఛైర్ పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు.