వ్యవసాయం దండగ కాదు.. ఒక పండగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపిస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. ఉన్నత చదువులు చదువుకున్న చాలా మంది.. ఇప్పుడు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట హెడ్ క్వార్టర్, పెద్దకోడెపాక గ్రామాల్లో ఆయన పర్యటించారు.
'వ్యవసాయం ఒక పండగ అని సీఎం నిరూపిస్తున్నారు' - ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తాజా వార్తలు
వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు.
!['వ్యవసాయం ఒక పండగ అని సీఎం నిరూపిస్తున్నారు' mla Gandra Venkataramana Reddy toured in warangal rural district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7392074-1031-7392074-1590736729899.jpg)
'వ్యవసాయం ఒక పండగ అని సీఎం నిరూపిస్తున్నారు'
రైతాంగానికి సాగునీరు, ఉచిత విద్యుత్, పంటల పెట్టుబడులు, రుణమాఫీలు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధరలు వంటివి ఎన్నో అందుబాటులోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కరోనా వ్యాక్సిన్ కోసం మళ్లీ ప్లాస్మా దానం
TAGGED:
వరంగల్ రూరల్ జిల్లా వార్తలు