వరంగల్ రూరల్ జిల్లా పరకాల, నడికుడ మండలాలకు సంబంధించిన వికలాంగులకు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సదరమ్ ధ్రువపత్రాలు అందించారు.
'ప్రజాప్రతినిధులను చూసే ప్రజలు నేర్చుకుంటారు' - MLA Dharma Reddy distributed Sadaram certificates
పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి నడికుడ, పరకాల మండలాల్లో వికలాంగులకు సదరమ్ ధ్రువపత్రాలు పంపిణీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులకు చెత్త బుట్టలను అందజేశారు.

'ప్రజాప్రతినిధులను చూసే ప్రజలు నేర్చుకుంటారు'
రెండు మండలాల్లోని సర్పంచులకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు డస్ట్బిన్లు(చెత్త డబ్బాలు) పంపిణీ చేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం ప్రథమంగా రాజకీయ నాయకుల దగ్గర నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులను చూసి ప్రజలు తప్పకుండా స్వచ్ఛత వైపు అడుగులు వేస్తారని ఆశాబావం వ్యక్తం చేశారు.
'ప్రజాప్రతినిధులను చూసే ప్రజలు నేర్చుకుంటారు'
ఇవీ చూడండి: 'న్యాయస్థానాలను ధిక్కరిస్తే మూల్యం తప్పదు'