ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు తీవ్ర పంట నష్టం జరిగిందని.. రైతులకు ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా హన్మకొండలోని తన నివాసంలో తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి అండగా ఉంటూ.. వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు అధికారులు పాల్గొన్నారు.
అకాల నష్టంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి: ఎమ్మెల్యే ధర్మారెడ్డి - అకాల నష్టంపై పూరిస్థాయి నివేదిక ఇవ్వాలన్న చల్లా ధర్మారెడ్డి
అకాల వర్షాల కారణంగా జరిగిన నష్టంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశించారు. హన్మకొండలోని తన నివాసంలో మండల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
అకాల నష్టంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలి: ఎమ్మెల్యే ధర్మారెడ్డి