తెలంగాణ

telangana

ETV Bharat / state

'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్' - mla challa dharmareddy

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా పల్లెల్లో ప్రగతి మొదలైందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించారు.

mla_challa_dharmareddy_tractors_distribution
'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్'

By

Published : Nov 30, 2019, 5:37 PM IST

వరంగల్ రూరల్ జిల్లాలోని దామెర మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు అందజేశారు. కనీవిని ఎరుగని రీతిలో గ్రామాల్లో అభివృద్ధి కొనసాగుతోందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఎంతైనా ఖర్చుచేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. మన ఇల్లు ఎలా ఉంచుకుంటామో గ్రామాన్ని కూడ అలానే శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్​దేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

'అద్భుత రీతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయ్'

ABOUT THE AUTHOR

...view details