వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట శివారు మల్లికుంట 93 సర్వే నెంబర్ ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కబ్జా చేయాల్సిన అవసరం తనకు లేదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే.. కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం: చల్లా ధర్మారెడ్డి
వరంగల్ గ్రామీణ జిల్లా గొర్రెకుంట శివారు మల్లికుంటలోని ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పష్టం చేశారు. కబ్జాకు పాల్పడినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
అంతకుముందు మొగిలిచర్లలో రూ.5 కోట్ల నిధులతో సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. మొగిలిచర్ల రూపురేఖలు మార్చేందుకు ఈ నిధులను కేటాయించినట్లు తెలిపారు.