తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలి' - Warangal Rural District Latest News

సీఎం కేసీఆర్ పుట్టినరోజు​ పురస్కరించుకొని పరకాల పట్టణంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుణ్ణి కోరారు. కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.

MLA Challa Dharmareddy and his wife conducted special pujas in Parakala
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి దంపతులు ప్రత్యేకపూజలు

By

Published : Feb 17, 2021, 12:51 PM IST

సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు పురస్కరించుకొని పరకాల పట్టణంలో చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు. శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకున్నారు.

అపరభగీరధుడు సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుణ్ణి కోరినట్లు వారు తెలిపారు. దేవాలయ ఆవరణలో కోటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటారు.

సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా నియోజకవర్గంలోని 133 గ్రామాల్లో దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో తెరాస శ్రేణులు, అభిమానులు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇదీ చూడండి:కేసీఆర్​కు అరుదైన బహుమతి.. జోరుగా 'కోటి వృక్షార్చన'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details