రైతును రాజును చేయడమే లక్ష్యమన్న కేసీఆర్... తన మాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి అన్నారు. వరంగల్ గ్రామీణం జిల్లా బొల్లికుంట గ్రామం వద్ద నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వచ్చే జూన్ మాసంలో సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు.
ఆ మాటను కేసీఆర్ నిజం చేశారు: చల్లాధర్మారెడ్డి - కాళేశ్వరం వార్తలు
వరంగల్ రూరల్ జిల్లా బొల్లికుంట గ్రామం వద్ద నిర్మిస్తున్న కాలువ పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. కేసీఆర్ తను అన్న మాటను నిజం చేశారని పేర్కొన్నారు.

ఆ మాటను కేసీఆర్ నిజం చేశారు: చల్లాధర్మారెడ్డి
గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని ఆరోపించారు. రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని పంట దిగుబడి ఈ సంవత్సరం వచ్చిందని అన్నారు. అందుకు కారణం భగీరథుడు కేసీఆర్ చేపట్టిన కాళేశ్వర ప్రాజెక్టు అని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:దేశీయ కిట్లు వచ్చేస్తున్నాయ్....!