తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె ప్రగతితో గ్రామాభివృద్ధి: ఎమ్మెల్యే చల్లా - పరకాలలో ఎమ్మెల్య చల్లాధర్మారెడ్డి పారిశుద్ధ్య పనులపై సమీక్ష

పల్లెప్రగతితో గ్రామాల అభివృద్ధి.. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో సర్పంచులు, అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

mla challa dharma reddy review meet with sarpanchs in warangal rural parakala
'పల్లె ప్రగతితో గ్రామాల అభివృద్ధి'

By

Published : Jun 6, 2020, 1:17 PM IST

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. వరంగల్​ రూరల్​ జిల్లా పరకాలలో ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.

పల్లెప్రగతి మూడో విడతలో చేపట్టిన శానిటైజేషన్ డ్రైవ్, పారిశుద్ధ్య పనులు గ్రామాల్లో ఏవిధంగా చేపడుతున్నారని గ్రామాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డ్, శ్మశానవాటికల నిర్మాణాలు ఎందుకు పూర్తిచేయలేదని అధికారులు, సర్పంచులను ప్రశ్నించారు. పెండింగ్​లో ఉన్న డంపింగ్ యార్డు, శ్మశానవాటిక పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి:'మరో 80 ఏళ్లలో భారత్​కు పెను ముప్పు

ABOUT THE AUTHOR

...view details