వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని సంగెం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమావేశంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళులర్పించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
'సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం' - సంగెంలోని సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వెల్లడించారు. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు.
'సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం'
మండలంలోని సమస్యలు, అభివృద్ధి పనులపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వ పరంగా న్యాయం చేస్తామన్నారు. మండలంలోని పంటచేలల్లో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ సహించదు'