తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీకారం - Warangal Rural District Latest News

గ్రామాల్లో అభివృద్ధి పట్టణాలకు పోటీగా జరుగుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తెలిపారు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

mla-challa-dharma-reddy-has-been-involved-in-various-development-programs-in-warangal-rural-district
పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చల్లా

By

Published : Dec 4, 2020, 2:07 PM IST

వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండల పరిధిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. బాలు నాయక్ గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. మొండ్రాయిలో రైతు వేదిక, కాపుల కనపర్తిలో 2 కోట్ల 30 లక్షల రూపాయలతో నూతన రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రంగంపేట పెద్దచెరువులో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు.

కేసీఆర్ సంకల్పంతోనే రాష్ట్రంలో పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని ధర్మారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామంలో ప్రకృతి వనం, వైకుంఠధామం, పల్లెలు పట్టణాలకు పోటిగా అభివృద్ధి చెందేలా తెరాస కృషి చేస్తుందని ఎమ్మెల్యే వివరించారు.

ఇదీ చూడండి :వెలువడుతున్న ఫలితాలు.. బోణి కొట్టిన మజ్లిస్

ABOUT THE AUTHOR

...view details